‘అమ్మానాన్న విడిపోయి మంచి పని చేశారు’

TeluguCinema 25 May 2021
shruti haasanfeb14black3

“మా అమ్మానాన్న విడిపోవడం కరెక్ట్. వాళ్ళు విడాకులు తీసుకున్నందుకు నేను హ్యాపీ,” అంటోంది శ్రుతి హాసన్. ఆమె తల్లితండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోయి చాలాకాలం అయింది. లేటెస్ట్ గా జూమ్ టీవీ ఇంటర్వ్యూలో శృతి తల్లితండ్రుల గురించి మాట్లాడింది.

“కలిసి బతకలేమని ఇద్దరు అనుకున్న తర్వాత విడిపోవడమే కరెక్ట్. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, రాజీపడి బతకడం కరెక్ట్ కాదు. నా దృష్టిలో మా అమ్మానాన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్. వాళ్ళు విడిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. వాళ్ళు కలిసినప్పుడు కన్నా విడిగా ఉన్నప్పుడే ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు అని చెప్పగలను. ఇప్పుడు వారిద్దరి మధ్య మాటల్లేవు,” అని శృతి హాసన్ చెప్పింది.

సారిక కమల్ హాసన్ కి రెండో భార్య. మొదటి భార్య వాణి గణపతి. సారికతో విడిపోయిన తర్వాత కమల్ హాసన్ చాలాకాలం గౌతమితో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా విడిపోయి దూరంగా ఉంటోంది. కమల్ హాసన్, సారికలకు ఇద్దరు కూతుళ్లు.. శృతి, అక్షర.