కొత్త ఆఫర్ల కోసమే గ్లామర్ డోస్!

Shruti haasan

శృతి హాసన్ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచింది. వారం క్రితం కొత్త ఫోటోషూట్ ఫోటోలలో అందచందాలు అన్నీ ఒలకబోసింది. మళ్ళీ ఇప్పుడు బికినీ అందాలు ఆరబోసింది. ఆమె రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచుతోంది.

రెండేళ్ల క్రితం శృతి హాసన్ ఫారీన్ బాయ్ ఫ్రెండ్ తో డీప్ లవ్ లో ఉండి కెరీర్ ని పోగొట్టుకొంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో అతనికి బ్రేకప్ చెప్పింది. ఇక ఈ ఏడాది వరుసగా సినిమాలు ఒప్పుకుందామని ప్లాన్ చేసింది. అలా ఒప్పుకున్నవే రవితేజ మూవీ “క్రాక్”, తమిళంలో “లాభం”. ఐతే, లాక్డౌన్ వల్ల ఆమెకి కెరీర్ కి బూస్ట్ రాలేదు. మళ్ళీ కొత్త సినిమాల షూటింగ్లు షురూ అవుతున్నాయి కాబట్టి కొత్త ఆఫర్ల కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచినట్లుంది.

శృతికిప్పుడు 34 ఏళ్ళు. హీరోయిన్ గా ఆమె ప్రైమ్ ఏజ్ దాటింది. సీనియర్ హీరోయిన్ల ఖాతాలోకి చేరిపోనుంది త్వరలోనే. అందుకే ఇప్పుడు కెరీర్ చక్కదిద్దుకునే పనిలో పడింది.

ఈ నెలల్లోనే ఆమె “వకీల్ సాబ్” షూటింగ్ లో పాల్గొంటుంది. పవన్ కళ్యాణ్, శృతిపై ఒక పాట చిత్రీకరిస్తారట.

Also Check: శృతి హాసన్ ఫోటోషూట్

Advertisement
 

More

Related Stories