శ్వేత ‘బ్రా’ వివాదం!

నటి శ్వేతా తివారీ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ టీవీ సీరియల్స్ తో దేశమంతా పాపులర్ అయింది. ఈ అందాల ఆంటీ ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కొంది.

ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఒక స్టేట్మెంట్ వివాదానికి కారణం. ఇంతకీ ఆమె అన్న మాట ఏంటంటే… “దేవుడు నా బ్రా సీజ్ కొలుస్తున్నాడు (God is taking the measurements for my bra).”

దాంతో, ఆమెని అరెస్ట్ చెయ్యాలంటూ కల్చర్ ఆక్టివిస్ట్లు రంగంలోకి దిగారు. దాంతో, ఈ విషయంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

ఇంతకీ, ఆమె అలా ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ వెబ్ సిరీస్ ఫ్యాషన్ రంగం చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇందులో మోడల్ గా నటిస్తోంది. సౌరబ్ జైన్ అనే నటుడు ‘బ్రా’ ఫిట్టర్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ‘మహాభారతం’ టీవీ సీరియల్ లో సౌరబ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. సో, శ్వేత దేవుడు (సౌరబ్) నా బ్రా సైజు కొలుస్తున్నాడు అని జోక్ చేసింది. ఆమె మాట్లాడింది దేవుడు పాత్ర పోషించిన నటుడి గురించి.

కానీ కాంటెక్స్టుతెలియని వీడియో వైరల్ కావడంతో గోల మొదలైంది. పొలీసు దర్యాప్తు వరకు వచ్చింది.

అన్నట్లు, శ్వేతా తివారికి ఎదిగిన కూతురు ఉంది. ఆమె కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement
 

More

Related Stories