
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా చాలా తొందరగా ఎదిగారు. చిన్న చిన్న పాత్రలు, సైడ్ రోల్స్ చేసుకునే సిద్ధూ జీవితాన్ని “టిల్లు” సినిమా మార్చేసింది. ఆ తర్వాత “టిల్లు స్క్వేర్”తో మరింతగా రైజ్ అయ్యాడు. ఆ ఊపులో “జాక్” చేశాడు. సినిమా మధ్యలోనే సిద్ధూకి, దర్శకుడికి మధ్య లొల్లి.
ఇద్దరూ తమకు నచ్చిన విధంగా తీసుకుంటూ, చేసుకుంటూ వెళ్లారు. దాంతో జనాలకి ఆ కిచిడి నచ్చలేదు. సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. తీసుకున్న పారితోషికంలో 5 కోట్లు వెనక్కి కట్టాడు సిద్ధూ. ఇప్పుడు “తెలుసు కదా” చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమా ఆడాలి.
“జాక్” సినిమా కన్నా ముందే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఇది ఆడకపోతే తదుపరి లైన్లో ఉన్న సినిమాలకు బిజినెస్ దెబ్బతింటుంది. దానివల్ల అతని పారితోషికం పెరగదు. “టిల్లు స్క్వేర్”తో వచ్చిన క్రేజ్ అంతా పోతుంది. అందుకే, “తెలుసు కదా” విషయంలో ఎక్కువ ప్రమోషన్లు చేస్తున్నాడు. సినిమాని ఎలాగైనా పాస్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.
టిల్లు హిట్ అయినా పెద్దగా సంపాదించుకోలేదని అంటున్నాడు సిద్ధూ. ఇప్పుడే వెనకేసుకోవాల్సిన టైం వచ్చిందట. అందుకే కొంచెం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు.





