తాగుడు మానేశా: హీరో శింబు


పలువురు పేరొందిన స్టార్స్ తాగుడు, డ్రగ్స్ కి బానిసలుగా మారి కెరీర్ ని పాడు చేసుకున్నారు. అందులో తెలుగు హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. ఐతే, ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడి మళ్ళీ కెరియర్ ని తీర్చిదిద్దుకున్న తారల లిస్ట్ కూడా ఉంది. ఆ లిస్ట్ లో శృతి హాసన్ ఒకరు.

ఒకప్పుడు శృతి హాసన్ మందులేనిదే ఉండేది కాదు. కానీ తన ఆరోగ్యం, జీవితం పాడు అయిపోతోందని గ్రహించి మానేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. ఇప్పుడు మందు ముచ్చట లేదు.

శృతిలాగే మందుకు దూరం అంటున్న హీరో…శింబు. అతను కూడా ఓపెన్ గా బయటికి వచ్చి చెప్తున్నాడు. ఏడాది అయిందట మందు మానేసి. పూర్తిగా మారిపోయాడు శింబు. హెల్త్ మీద, ఫిట్ నెస్ ఫైన దృష్టి పెట్టాడు శింబు. అతను ఇప్పుడు స్లిమ్ గా, సూపర్ స్టైలిష్ గా మారిపోయాడు.

ఒకప్పుడు శింబు టాప్ లీగ్ లో ఉండేవాడు. ఇప్పుడు రేస్ లో వెనుకబడ్డాడు ఈ మన్మథ. మళ్ళీ పుంజుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement
 

More

Related Stories