కార్తీ సరసన సిమ్రాన్?

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ యువ హీరో కార్తితో డ్యూయెట్లు పడనుందా? వీళ్లద్దరూ జత కడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. ‘సర్దార్’ అనే సినిమాని ఇటీవలే ప్రకటించాడు కార్తీ. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది.

ఐతే, ఇందులో కార్తీ ద్విపాత్రిభినయం పోషిస్తున్నాడు అని టాక్. త్రండ్రి పాత్ర క్యారెక్టర్లో కార్తీకి జోడిగా సిమ్రాన్ ని తీసుకుంటున్నారు అని కోలీవుడ్ కోడై కూస్తోంది. సిమ్రాన్ కిప్పుడు 45 ఏళ్ళు. తల్లి పాత్రలకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న టైంలో కార్తీ సరసన నటించే ఛాన్స్ రావడం విశేషమే.

గతంలో సూర్య కూడా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసినప్పుడు తండ్రి పాత్రకి జోడిగా సిమ్రాన్ నటించింది. ఇటీవలే, ఆమె రజినీకాంత్ సరసన ‘పేట్టా’ సినిమాలో కనిపించారు.

Advertisement
 

More

Related Stories