శోభితకి ఇక ఆనందమే!

శోభిత గత డిసెంబర్ లో నాగ చైతన్యకి భార్యగా మారింది. ఆమె చైతన్యని పెళ్లి చేసుకున్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంది. శోభిత వల్లే నాగ చైతన్య సమంతకి డివోర్స్ ఇచ్చాడని చాలా మంది భావించారు. సమంతతో కాపురం చేస్తుండగానే చైతన్య, శోభిత అఫైర్ నడిచిందేమో అని కూడా కొందరు సందేహం వ్యక్తం చేశారు.
అందుకే, గతేడాది డిసెంబర్ 4న పెళ్లి జరిగినప్పుడు నాగ చైతన్యకి పెద్దగా కామెంట్స్ రాలేదు కానీ శోభితకి సమంత ఫ్యాన్స్ నుంచి ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అది రివర్స్ అయింది.
కొంతమంది ట్రోలర్స్ ఇప్పుడు శోభితకి సారీ చెప్పారు. ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నామని అంటున్నారు. నిన్న సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకొంది. దాంతో చాలామందికి విషయం అర్థమైంది. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి మరో హీరోయిన్ కాదని తెలిసిపోయింది. అసలు సమస్య వేరు. అందుకే, అనవసరంగా శోభితని బ్లేమ్ చేశామని ట్రోలర్స్ భావిస్తున్నారు. అందుకే ఆమెకి సారీ చెప్తున్నారు.
మరోవైపు, శోభిత కూడా ఇక ఆనందంగా తన కాపురాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఆమెకి ఇక ఎవరి నుంచి కామెంట్స్ రావు. ఇదివరలా ఆమెని “హోమ్ బ్రేకర్” అని తిట్టిపోయారు.