ఆ ప్రశ్నలు తగ్గిపోయాయి!

Sobhita Dhulipala

శోభిత ధూళిపాళ, నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నారనేది పాత న్యూస్. కొంతకాలం క్రితం వరకు అటు చైతన్యకు, ఇటు శోభితకు మీడియా నుంచి డేటింగ్ విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐతే, తాజాగా ఆమెని ఈ ప్రశ్నలు అడగడం మీడియా మానేసింది.

ప్రస్తుతం శోభిత ముంబైలో ఉంటోంది. అక్కడ పలు వెబ్ సిరీస్ లు చేస్తోంది. అలాగే ఫ్యాషన్ షోలలో పాల్గొంటోంది. దాదాపు నిత్యం ఆమె మీడియాని కలుస్తోంది. ఇంటర్వ్యూలు ఇస్తోంది. కానీ ఇప్పుడు ఆమె తన డేటింగ్ గురించి ప్రశ్నలు ఎదుర్కోవడం లేదు. ఎందుకంటే, ఆమె నాగ చైతన్య గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తోంది.

ఐతే, శోభిత, చైతన్య డేటింగ్ లో ఉన్న మాట నిజమే. ఆమె హైదరాబాద్ వస్తే నాగ చైతన్యతోనే కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ అనేకసార్లు రెస్టారెంట్ లలో దర్శనమిచ్చారు.

ఇక నాగ చైతన్య తన కొత్త సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. ఇప్పట్లో అతను మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చే అవసరం లేదు. సో, చైతన్యకి కూడా కొన్నాళ్ళు డేటింగ్ ప్రశ్నలు ఎదురు కావు.

Advertisement
 

More

Related Stories