సోనాలి బింద్రే లైఫ్ లో మసాలా లేదు!

TeluguCinema Team 08 Nov 2025
Sonali Bendre doesn’t want a biopic made on her life

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన సోనాలి బింద్రే ఇప్పుడు తల్లి పాత్రలు పోషిస్తున్నారు. ఆమె క్యాన్సర్ ని జయించి మళ్ళీ నటిస్తున్నారు. అందుకే ఆమె సక్సెస్ స్టోరీని కథగా తీస్తే బాగుంటుంది కదా అని అడిగితే తన జీవితంలో మసాలా లేదు అని అంటున్నారు.

తన జీవిత చరిత్రను ఎవరైనా బయోపిక్ తీయాలనుకుంటే వారికి నా కథలో డల్ నెస్ తప్ప ఏమి కనిపించదు. బయోపిక్ కి కావాల్సిన మసాలా లేదు అన్నారు.

ఆమె నిర్మాత గోల్డి బెహల్ ని పెళ్లాడారు. వీరికి ఎదిగిన కుమారుడు ఉన్నాడు. 50 ఏళ్ల సోనాలి కెరీర్ ప్రారంభంలో ప్రేమ అఫైర్స్ విషయాల్లో పుకార్లు ఎదుర్కొంది. అయినా తన జీవితంలో గొప్ప స్పైసి మేటర్స్ లేవని చెప్తున్నారు.

తాను ఎలాంటి కథలకు అయినా ఓకె చెప్తాను అంటున్నారు. అలాగే పాత్రల విషయంలో కూడా తల్లిగానే చెయ్యాలని అనుకోవడం లేదంటున్నారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News