రాజకీయాల్లోకి రాను: సోనూసూద్

Sonu Sood


దేశంలో ఇప్పుడు రియల్ హీరో …సోనూసూద్. ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి కరోనా రోగులను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. సోనూసూద్ ఈ లెవల్లో సాయం ఎలా చేస్తున్నాడు? ఎక్కడినుంచి ఇంత డబ్బు వస్తోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. ఐతే, అతన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

SonuSood4PM అని ఇటీవల ఒక హాష్ టాగ్ సోషల్ మిడిల్ ట్రెండ్ అయింది. సోనూసూద్ లాంటి నిజమైన సేవాభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటేనే దేశం బాగుపడుతుందని పలువురు సెలెబ్రిటీలు కూడా ఇటీవల కామెంట్ చేశారు.

ఐతే, తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్తున్నాడు సోనూ.

సామాన్యుడిగా సేవ చెయ్యడమే ఇష్టం అని అంటున్నాడు. సినిమాల్లో నటిస్తూ తద్వారా వచ్చిన డబ్బుతో తన శక్తిమేరా సాయం చేస్తానని స్పష్టం చేశాడు.

More

Related Stories