కృతిని ఫాలో అవుతోన్న శ్రీలీల

Sreeleela

ఒక్క హిట్ కొడితే చాలు మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వస్తుంటాయి హీరోయిన్లకు. అలాగే మూడు సినిమాల్లో ఆఫర్లు వస్తే చాలు కోటి కావాలంటారు. మొన్నామధ్య ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అలాగే చేసింది.

‘ఉప్పెన’ విడుదలకు ముందే ఆమెకి ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా హిట్, మిగతా రెండు యావరేజ్. కానీ ఆమె చేతిలో ఇప్పుడు మరో నాలుగు చిత్రాలున్నాయి. ఈ నాలుగు చిత్రాలకు ఒక్కో సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటోంది.

కృతిని చూసి శ్రీలీల కూడా నేర్చుకొంది. ‘పెళ్లి సందD’ అనే చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది శ్రీలీల. ఆ సినిమా బీసీ సెంటర్లలో బాగా ఆడింది. ఆమె గ్లామర్ సినిమాకి ప్లస్ అయింది. దాంతో, ఒకేసారి ఆమెని నాలుగు చిత్రాల్లో తీసుకున్నారు. ఈ ఆఫర్లను చూసి ఈ భామ కూడా ఇప్పుడు కోటి అడుగుతోందట

రవితేజ సరసన ‘ధమాకా’ చిత్రంలో నటిస్తోంది. అది సెట్ పై ఉండగానే సితార సంస్థ రెండు చిత్రాలకు బుక్ చేసింది. మరో నిర్మాత కూడా ఇంకో సినిమాకి తీసుకున్నాడు. ఈ నాలుగు చిత్రాలు కన్ఫర్మ్ కావడంతో ఇప్పుడు ఆమె కొత్త చిత్రాలకు కోటి డిమాండ్ చేస్తోందట.

Advertisement
 

More

Related Stories