ఇక వరుసగా మూడు ప్రమోషన్లు

Sreeleela


హీరోయిన్ శ్రీలీల ఇప్పటివరకు షూటింగ్ లతో బిజీగా ఉంది. ఈ నెలాఖరు నుంచి వరుసగా ప్రమోషన్లతోనే గడపాలి. ఆమె నటించిన, నటిస్తున్న మూడు సినిమాలు కేవలం 50 రోజుల గ్యాప్ లో విడుదల కానున్నాయి.

“ఆదికేశవ” సినిమా నవంబర్ 10 నుంచి నవంబర్ 24కి వాయిదా పడింది. దాంతో, ఈ భామకి వరుసగా ప్రమోషన్లు చేసుకోవాల్సిన అవసరం పడింది. నవంబర్ నెలాఖరు అంతా “ఆదికేశవ” సినిమా ప్రమోషన్ తో సరిపోతుంది. ఇక డిసెంబర్ 1 నుంచి పది రోజుల పాటు నితిన్ హీరోగా నటించిన “ఎక్స్ట్రా” సినిమా ప్రచారంలో పాల్గొనాలి. ఆ సినిమా డిసెంబర్ 8న విడుదల కానుంది. ఇందులో ఆమె నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇక డిసెంబర్ చివరి వారం నుంచి “గుంటూరు కారం” ప్రమోషన్ హంగామా షురూ అవుతుంది.

“గుంటూరు కారం” జనవరి 12న విడుదల కానుంది. ఆమె కెరీర్లో ఇదే అతి పెద్ద మూవీ. అగ్ర హీరో మహేష్ బాబుతో నటిస్తోంది ఇందులో. ఈ సినిమా ప్రమోషన్ డిసెంబర్ చివరి నుంచి ఊపందుకుంటుంది.

ఇటీవల “భగవంత్ కేసరి” సినిమా ప్రమోషన్లో శ్రీలీల చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. ఆ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని తన వంతుగా అందించింది. టూర్స్ కూడా చేసింది. ఇక ఇప్పుడు “ఆదికేశవ”, “ఎక్స్ట్రా”, “గుంటూరు కారం” సినిమాల పబ్లిసిటీ కోసమే 50 రోజుల పాటు ఫోకస్ పెట్టాలి.

Advertisement
 

More

Related Stories