శ్రీలీలకు స్ఫూర్తి ఎన్టీఆర్ అంట!

TeluguCinema 24 Aug 2025
Viral Vayyari Sreeleela

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే వినిపించే పేరు శ్రీలీల. కేవలం టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ హీరోయిన్లలోనే ది బెస్ట్ డాన్సర్ గా ఆమెను గుర్తించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె టాలెంట్ అలాంటిది మరి.

మరి డాన్స్ లో ఆమెకు స్ఫూర్తి ఎవరు. ఈ విషయాన్ని తాజాగా శ్రీలీల తల్లి బయటపెట్టారు. శ్రీలీలను డాన్సర్ ను చేయాలనే తన ఆలోచనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని వెల్లడించింది ఆమె తల్లి స్వర్ణలత. చిన్నప్పుడే ఎన్టీఆర్ కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలనే వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.

చిన్నప్పుడు ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ చూసి, తనకు కూతురు పుడితే ఎన్టీఆర్ లా డాన్సర్ ను చేస్తానని, స్వర్ణలత అప్పుడే డిసైడ్ అయ్యారంట. ఆ తర్వాత ఆమెకు శ్రీలీల జన్మించింది. అలా చిన్నతనం నుంచి శ్రీలలను శాస్త్రీయ నృత్యం నేర్పించారు.

అలా డాన్స్ లో ప్రావీణ్యం సంపాదించుకున్న శ్రీలీల, ఆ తర్వాత నటిగా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోంది.