మళ్ళీ శ్రీముఖి పెళ్లి వార్త!

“శ్రీముఖి పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి ముహూర్తం సెట్ అయింది… “

ఇలాంటి హెడ్డింగ్స్, ఇలాంటి వార్తలు మనం చాలా సార్లు చూశాం. కానీ అవేవి నిజం కాలేదు. మరోసారి ఆమె వెడ్డింగ్ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

ALSO CHECK: Sreemukhi 2023 spl new stills

ఈ సారి జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆమె ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోనుందట. ఆ వ్యాపారవేత్తతో ఆమె చాలాకాలంగా సీక్రెట్ ప్రేమలో ఉంది (ట). ఇప్పుడు ఇరువైపులా తల్లితండ్రులు వీరి బంధానికి ఆమోద ముద్ర వేసినట్లు టాక్. ఈ విషయాన్ని ఆమె తన మిత్రులతో పంచుకుందిట. అలా ఆమె పెళ్లి వార్త మరోసారి ఇలా వైరల్ అయింది.

ఐతే, ఈ కొత్త వార్తలపై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ భామ టీవీ యాంకర్ గా బిజీగా ఉంది.

 

More

Related Stories