శ్రియా రెడ్డికి మాటిచ్చిన పవన్

TeluguCinema 22 Sep 2025
sriyareddy ogf

‘ఓజీ’ సినిమాలో నటించింది శ్రియా రెడ్డి. ఈ సినిమాలో ఆమె గీత అనే పాత్ర పోషించింది. సెట్స్ పై ఆమె యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు పవన్ కల్యాణ్. అందుకే ఆమెకు నిండు సభలో మాటిచ్చారు.

‘ఓజీ’ లో శ్రియారెడ్డి హార్డ్ వర్క్ చూసి ముచ్చటేసిందంట. ఆమెను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు పవన్. అయితే తనతో కలిసి నటించాలని శ్రియ రెడ్డి కోరిందట. ఆమె కోరికను పవన్ అంగీకరించాడు.

“శ్రియారెడ్డికి మాటిస్తున్నాను… భవిష్యత్తులో కచ్చితంగా ఓ పవర్ ఫుల్ పాత్రలో.. పవర్ ఫుల్ గా ఉండేలా ఆమెతో కలిసి నటిస్తాను.” అంటూ ఓజీ కన్సర్ట్ సభలో ఆమెకు మాటిచ్చాడు.

శ్రియారెడ్డి ఇటీవల ప్రభాస్ నటించిన “సలార్”లో కూడా నటించింది. ఆమెకి ఇది వరుసగా రెండో భారీ తెలుగు చిత్రం. గతంలో ఆమె తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో పెద్ద ప్రాజెక్ట్స్ లాగేసుకుంటోంది.