2025 టార్గెట్ గానే షూటింగ్!

Mahesh Babu and Rajamouli


మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. “ఆర్ ఆర్ ఆర్” తర్వాత తన తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే అని రాజమౌళి చాలాకాలంగా చెపుతూ వచ్చారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

బాలీవుడ్ మీడియా, సోషల్ మీడియా ఈ సినిమా లాంచ్ గురించి ప్రచారం మొదలు పెట్టాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు ఈ సినిమా షూటింగ్ షురూ అవుతుందనేది ఈ కథనాల సారాంశం. కానీ, రాజమౌళి అలాంటివి పట్టించుకోరు. పుట్టినరోజు నాడు సినిమా మొదలుపెట్టాలి వంటి పనులు చెయ్యరు రాజమౌళి. సినిమా లాంఛనంగా ఎప్పుడు లాంచ్ అయినా విడుదల తేదీ విషయంలో మాత్రం రాజమౌళి ఒక ప్లాన్ లో ఉన్నారట.

2025లోనే సినిమా విడుదల అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. రాజమౌళి సాధారణంగా ఒక్కో సినిమాని మూడేళ్లు తీస్తారు. కానీ, ఈ సారి మాత్రం మూడేళ్లు కాకుండా రెండున్నర ఏళ్లలోపే విడుదల చేస్తారట.

త్రివిక్రమ్ తీస్తున్న ‘గుంటూరు కారం’ జనవరి 13న విడుదల అవుతుంది. ఇక రాజమౌళి చిత్రం 2025లో విడుదల చేస్తే పెద్ద గ్యాప్ ఉండనట్లే. కానీ రాజమౌళి నిజంగా 2025లో విడుదల చెయ్యగలరా అనేది పెద్ద డౌటే.

Advertisement
 

More

Related Stories