ఇంకొంచెం ‘నాటు నాటు’

TeluguCinema Team 25 Dec 2021
Sukumar


దర్శకుడు సుకుమార్ మొదట్లో పోష్ అర్బన్ కథలు తీసేవారు. ‘రంగస్థలం’ నుంచి పంథా మారింది. రామ్ చరణ్ వంటి మాస్ హీరోని “రా”గా చూపించి ఆశ్చర్యపరిచారు సుకుమార్. ఆ సక్సెస్ ఊపులో “పుష్ప”లో హీరోని మరింత నాటుగా మలిచారు. ఒకప్పుడు తమిళ దర్శకుడు బాలా (‘శివపుత్రుడు’) తీసినట్లు హీరో అల్లు అర్జున్ పాత్రని చాలా నాటుగా చూపించారు.

రెండో భాగం ఇంకా రియలిస్టిక్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా మలుస్తున్నారు. మొదటి భాగం వచ్చింది. రెండో భాగంలో అల్లు అర్జున్ వర్సెస్ ఫహద్ ఫాజిల్ ఆట, వేట ఉంటుంది.

మొదటి భాగం క్లయిమాక్స్ లో పోలీస్ అధికారి ఫహద్ ఫాజిల్ ని డ్రాయర్ మీద నిల్చుండబెట్టి అవమానిస్తాడు. కానీ, సుకుమార్ మొదట రాసిన సన్నివేశం వేరు. హీరో అల్లు అర్జున్, ప్రతినాయకుడు ఫహద్… ఇద్దరినీ బట్టలు లేకుండా నగ్నంగా చూపిద్దామనుకున్నాడట సుకుమార్. ఐతే, తెలుగు ప్రేక్షకులు అది జీర్ణించుకోలేరని చివర్లో మార్చాడట.

‘పుష్ప’ హిందీ మార్కెట్ లో భారీ విజయం సాధించడం, “పాన్ ఇండియా” గుర్తింపు రావడంతో రెండో భాగం మీద మరింత ఫోకస్ పెట్టాలని సుకుమార్ డిసైడ్ అయ్యారట. హీరో అల్లు అర్జున్ పాత్ర, అలాగే మరికొన్ని సన్నివేశాలు మరింత వాస్తవికంగా, నాటుగా ఉంటాయట. ఇప్పుడు ఎలా చూపించినా జనం ఆదరిస్తారనే నమ్మకం సుకుమార్ కి కలిగిందట.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News