తాప్సి ఏంటి ఇలా చేసింది!

Taapsee

ఎవడిగోల వాడిది అంటే ఇదేనేమో. బాలీవుడ్ లో ఇప్పుడు రకరకాల సమస్యలు. ఆల్రెడీ నెపొటిజంపై ఓ రేంజ్ లో గోల నడుస్తోంది. మరోవైపు డ్రగ్స్ కలకలం కొనసాగుతోంది. ఇంకోవైపు లాక్ డౌన్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సినిమాలు సెట్స్ పైకి వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎంజాయ్ మెంట్ టూర్ పెట్టుకుంది తాప్సి.

అవును.. తన సినిమా పనులు, లాక్ డౌన్ కష్టాలు, బాలీవుడ్ వివాదాలు అన్నీ పక్కనపెట్టి మాల్దీవులు చెక్కేసింది ఈ బ్యూటీ. నిన్ననే అక్కడ ల్యాండ్ అయిన తాప్సి.. ఇలా వెళ్లడమే ఆలస్యం అలా ఎంజాయ్ మెంట్ షురూ చేసింది.

లాక్ డౌన్ తో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ బ్యూటీ… సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే ఎక్కడికైనా చెక్కేస్తానంటూ గతంలోనే ప్రకటించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో పరిస్థితులు కుదురుకోకముందే తాప్సి ఇలా సూట్ కేస్ సర్దేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో తాప్సి పెడుతున్న ఫొటోల్ని లైక్ చేస్తున్న బ్యాక్ ఒకటైతే.. ఇప్పుడిదంతా అవసరమా అంటూ గోల చేస్తున్న బ్యాచ్ ఇంకోటి తయారైంది.

Related Stories