మాల్దీవుల్లో మంట రేపుతోంది

Taapsee

ఇలా లాక్ డౌన్ ఎత్తేయగానే ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని చూసిన తాప్సి, మొత్తానికి మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. దిగిన మరుక్షణం నుంచి ఎంజాయ్ మెంట్ స్టార్ట్ చేసింది. అస్సలు టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదంటూ ఆల్రెడీ క్యాప్షన్ పెట్టిన ఈ బ్యూటీ.. వరుస ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ స్టిల్స్ తో మాల్టీవుల్లో మంటలు పుట్టిస్తోంది.

మరీ ముఖ్యంగా కొద్దిసేపటి కిందట తాప్సి పెట్టిన స్టిల్ అయితే ఓ రేంజ్ లో ఉంది. స్విమ్మింగ్ పూల్ లో ఓవైపు స్విమ్మింగ్ చేస్తునే, మరోవైపు అదే పూల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసే స్టిల్ అదిరిపోయింది. “రిచ్ కిడ్స్ కు ఏదైనా తేలుతూ అలా వస్తుందంటారు. నా విషయంలో అది ఇన్నాళ్లకు నిజమైంది.” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి మొహమాటపడకుండా తన లగ్జరీ లైఫ్ ను బయటపెట్టింది.

మొత్తానికి ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న వెకేషన్ ను తాప్సి ఎంజాయ్ చేయడం  స్టార్ట్ చేసింది. త్వరలోనే మరింత మంది బాలీవుడ్ తారలు విదేశాలకు చెక్కేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Related Stories