తమన్న అందులో అదుర్స్

TeluguCinema 09 Sep 2025
Tamannaah Bhatia

తమన్న భాటియా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. వర్క్ విషయంలో ఆమె కమిట్ మెంట్ మాములుగా ఉండదు. ఒప్పుకున్న సినిమా కోసం, యాడ్ కోసం, వెబ్ డ్రామా కోసం ఎన్ని రోజులైనా ప్రమోట్ చేస్తుంది. ఏ ఈవెంట్ కైనా వెళ్తుంది. అందుకే, ఇరవై ఏళ్లుగా ఆమె హీరోయిన్ గా రాణించగలుగుతోంది.

తాజాగా తమన్న “Do You Wanna Partner” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వీకెండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. తమన్నాతో పాటు డయానా పెంటి అనే మరో భామ కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా చేస్తున్న ప్రమోషన్ అదుర్స్ అనే చెప్పాలి.

గత 15 రోజులుగా ఆమె ప్రతి రోజూ ఎదో ఒక చోటుకు వెళ్లి ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో పాల్గొంటోంది. తాను నటించే ప్రాజెక్ట్ ఆడుతుందా లేదా అన్నది పట్టించుకోదు. తన వంతుగా తాను చేసిన ప్రాజెక్ట్ కి ప్రచారం కల్పించే పనిలో వెనకడుగు వెయ్యడు. అందుకే ప్రొఫెషనలిజంలో, కమిట్ మెంట్లో ఆమె అదుర్స్ అని అంటున్నారు మేకర్స్.

తమన్న తాజాగా మరో నాలుగు సినిమాలు, ఒక వెబ్ డ్రామా సైన్ చేసింది.