రుక్మిణికి అక్కడ కలిసిరాలేదు!

రుక్మిణి వసంత్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఈ కన్నడ బ్యూటీ చేతిలో మూడు పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమెకున్న క్రేజ్ ఏంటో. ఐతే, ఆమె నటించిన తమిళ చిత్రాలు మాత్రం పెద్దగా ఆడడం లేదు.
ALSO READ: Rukmini Vasanth’s dream run with Pan-Indian biggies
రుక్మిణి వసంత్ “ఏస్” అనే చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఆ సినిమా ఈ వేసవిలో విడుదలై ఫ్లాప్ అయింది.
తాజాగా ఆమె “మదరాసి” సినిమాతో మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించింది. శివకార్తికేయన్ హీరోగా నటించగా, మురుగదాస్ దర్శకత్వం వహించాడు ఆ మూవీని. ఇందులో ఆమె డెంటల్ మెడిసిన్ చదివే యువతిగా నటించింది. ఈ సినిమా మొదటివారం 50 కోట్ల పైన వసూళ్లు అందుకొంది. కానీ సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. దాంతో, ఈ సినిమా నిలబడుతుందా అనేది డౌటే.
రుక్మిణికి మాతృభాష కన్నడంలో బాగా పేరు వచ్చింది. అలాగే త్వరలోనే ‘కాంతార ప్రీక్వెల్’లో, యష్ హీరోగా రూపొందుతోన్న “టాక్సిక్”లో కనిపించనుంది.
ఇక ఎన్టీఆర్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “డ్రాగన్” మూవీలో నటించనుంది. తమిళంలో మరో అవకాశం వస్తుందా అనేది చూడాలి. మణిరత్నం ఒక లవ్ స్టోరీ ఈ భామతో ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది మెటీరియలైజ్ అవుతుందా?