అవును, ఆ సమస్య ఉంది: తమన్న

- Advertisement -
Tamannaah


తమన్న సూపర్ అందెగత్తె. ఆమెకి మిల్కీ బ్యూటీ అన్న పేరు ఉంది. ఐతే, ఆమె ఇప్పుడు సీనియర్ అయిపోయింది. ఇప్పటికే 18 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకొంది. ఆమె వయసు కూడా 30 దాటింది (ఇప్పుడు 33 ఏళ్ళు).

ఆమె ఇప్పుడు ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. అదే … బరువు. ఆమె ఈ మధ్య బరువు పెరిగింది. నిత్యం జిమ్ కి వెళ్తుంది ఈ భామ. అలాగే ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంది. అయినా, అప్పుడప్పుడు ఆమె బొద్దుగా కనిపిస్తోంది.

మూడు, నాలుగు రోజులు జిమ్ కి డుమ్మా కొడితే వెంటనే బరువు పెరుగుతున్నాను అంటోంది ఈ భామ. ఇదే ఆమెకున్న సమస్య.

ఇటీవల విడుదలైన “జైలర్” సినిమాలో ఈ భామ అలా బొద్దుగానే కనిపించింది. అలాగే, తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె రాంప్ పై నడిచింది. అప్పుడూ అలాగే కనిపించింది. ఒక్క రోజు కూడా జిమ్ ఎగ్గొట్టకుండా కష్టపడితేనే ఆమె ఫిట్ గా ఉంటుంది అన్నమాట.

ఇప్పటికే 75 చిత్రాలు పూర్తి చేసింది. అనేక వెబ్ డ్రామాస్ లో కూడా నటించింది. అలాగే, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. హీరోయిన్ గా ఎంతో సాధించింది, ఎంతో సంపాదించింది. అయినా, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనే ఆలోచన ఇప్పట్లో లేదు అంటోంది. సో, కెరీర్ ముఖ్యం అనుకుంటున్న ఈ భామ మరి ఎక్సర్ సైజ్ లు మిస్ కావొద్దు.

 

More

Related Stories