- Advertisement -

ఏదైనా ఆపద వస్తే చాలు… హీరోయిన్లు దానం చెయ్యరా? హీరోలు డబ్బులు ఇవ్వరా? అంటూ మీడియా, సోషల్ మీడియా ప్రశ్నించడం ఫ్యాషన్ అయిపొయింది అని తమన్నా మండిపడుతోంది. దానం చేయాలనుకునే వారు ఎలాగూ చేస్తారు. ఆలా చేసేవారిలో కొందరు బయటికి చెప్పుకుంటారు. కొందరు సైలెంట్ గా ఉంటారు. కానీ ఏ స్టేట్ లో వరదలొచ్చినా, కరోనా కేసులు పెరిగినా హీరో, హీరోయిన్లు డబ్బులు ఇవ్వరా అని అడగడం సబబు కాదు అనేది తమన్న అభిప్రాయం.
మనీ ఇవ్వాలని నటులను ఒత్తిడి చేయొద్దు అని తమన్న అంటుంది. ఆపదొచ్చిన్నప్పుడు సహజంగా అందరూ సాయం చేస్తారు.. కానీ డొనేషన్లు ప్రకటించినట్లు చేయమనడం కరెక్ట్ కాదు అని చెప్తోంది తమన్న.
చాలామంది హీరోయిన్లు ఈ ప్రెజర్లో ఉన్నారట.