- Advertisement -

అతిలోకసుందరి శ్రీదేవికి ఒక హాబీ ఉండేది. ఆర్ట్ పెయింటింగ్ వేయడం ఆమెకిష్టమైన దినచర్య అని చెప్తారు. ఆమె కూతురు జాన్వీ కూడా అదే బాటలో నడుస్తోంది.
జాన్వీ కూడా సూపర్ గా బొమ్మలు గీస్తోంది. ఆమె తన చిత్రలేఖన ప్రతిభని తాజాగా బయట పెట్టుకొంది. పెయింటింగ్ వేసిన, వేస్తున్న ఆర్ట్ బొమ్మలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది జాన్వీ. ఈ అందాల బొమ్మలో అందమైన బొమ్మలు వేసే టాలెంట్ బాగానే ఉంది.
మరోవైపు, జాన్వీని తెలుగులో నటింప చెయ్యాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఆమె నిజంగా తెలుగు సినిమా సైన్ చేస్తుందా లేదా అనేది చూడాలి.