సంక్రాంతికి పక్కాగా వస్తుంది!

“ది రాజా సాబ్” సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు టీం ప్రకటించి చాలా నెలలు అవుతోంది. ఐతే షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు ఆ అనుమానాలను ఎవరూ పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చింది టీం.
ఎందుకంటే ఈ రోజు ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టారు. “ది రాజా సాబ్” 2022 చివర్లో మొదలైంది. 2023 నుంచి ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంటే రెండేళ్ల పాటు ఈ సినిమాకి టైం కేటాయించాడు. ఇంత టైం పట్టడానికి కారణం… ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చెయ్యడం.
మొత్తానికి ఇప్పుడు “రాజా సాబ్”కి సంబంధించిన కీలక ఘట్టం ముగిసింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ మిగిలాయి. అవి కూడా టైంకి పూర్తి చేసి సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేస్తామని టీం గట్టిగా చెప్తోంది.
ప్రభాస్ కూడా సంక్రాంతిని మిస్ చేసుకోవద్దు అని టీంకి గట్టిగా చెప్పాడంట. సో, పొంగల్ పోటీలో ఈ రాజాసాబ్ పక్కాగా ఉంటారు. మిగతా సినిమాలే సైడ్ అవ్వాలి అన్నమాట.