బిజినెస్ కోసమే 3 నెలల ముందు

TeluguCinema 02 Oct 2025
The Raja Saab

“ది రాజా సాబ్” సినిమా దాదాపు నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకొంటోంది. దర్శకుడి మారుతికి పెద్ద పారితోషికం లేదు. కానీ నిర్మాణ పరంగా చాలా ఖర్చు అయింది నిర్మాతకు ఇన్నేళ్ళుగా తీస్తుండడం వల్ల. దర్శకుడికి క్రేజ్ లేదు కాబట్టి పూర్తిగా ప్రభాస్ పేరు మీదే బిజినెస్ చెయ్యాలి.

అందుకే, ప్రీ-రిలీజ్ బిజినెస్ కావాలంటే సినిమాలో భారీతనం ఉందని, మారుతి గత చిత్రాల్లా కాకుండా డిఫెరెంట్ గా ఉంటుందని బయ్యర్లకు, ఓటిటి సంస్థలకు చూపించేందుకు సినిమా విడుదలకు మూడు నెలల ముందే ట్రైలర్ ని విడుదల చేశారు. అదీ కాకుండా ఏకంగా మూడు నిమిషాలకు మించిన ట్రైలర్ ని కట్ చేశారు.

ఈ సినిమాకి థియేటర్ బిజినెస్ కాకుండా ఓటిటి, శాటిలైట్, ఆడియో రూపంలో 150 కోట్ల నాన్ థియేట్రికల్ ఆదాయాన్ని కోరుకుంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆలాగైతేనే పెట్టిన పెట్టుబడికి వర్కవుట్ అవుతుంది.

ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే, నిర్మాత కోరుకున్న లెవల్లో బిజినెస్ అవుతుందా అన్నదే డౌట్.