పాకిస్తాన్… చైతన్య… తండేల్!

TeluguCinema 22 Nov 2023
Thandel

నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రానికి “తండేల్” అనే పేరు పెట్టారు. ఈ పేరు విచిత్రంగా ఉంది. ఇది తెలుగు పేరు కాదు. పాకిస్తాన్ పదం ఇది. దీని వెనుక పెద్ద కథే ఉంది.

“తండేల్” సినిమా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లే జాలరుల కథ. వైజాగ్ కి చెందిన జాలరిగా నాగ చైతన్య నటిస్తున్నాడు. అతను తన జాలర్ల బృందానికి నాయకత్వం వహిస్తాడు. అలాంటి వారిని తండేల్ అని అంటారట. పాకిస్తాన్ లో ఈ పదం పాపులర్. అందుకే ఈ టైటిల్ పెట్టారు.

మరి పాకిస్తాన్ కి ఈ సినిమాకి ఏంటి సంబంధం ఏంటంటే… పాకిస్తాన్ నేవి మన ఇండియన్ జాలర్లను బంధిస్తుంది. ఆ బృందంలో హీరో నాగ చైతన్య కూడా ఉంటాడు. దేశభక్తితో కూడిన చిత్రమే ఇది. అందుకే పాకిస్తాన్ టైటిల్ ఈ సినిమాకి పెట్టారు.

ఇక సాయి పల్లవి పాత్ర కూడా కీలకమే. ఒక విధంగా చెప్పాలంటే “రోజా” సినిమాలో మధుబాల తరహా పాత్ర ఆమెది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం నాగచైతన్య కండలు పెంచాడు. గడ్డం పెంచాడు. డిసెంబర్ 9 నుంచి షూటింగ్ మొదలవుతుంది.

ASLO READ: Naga Chaitanya’s 23rd film titled ‘Thandel’