
దీపిక పదుకోన్ మొదట ప్రభాస్ హీరోగా రూపొందనున్న “స్పిరిట్” సినిమా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా “కల్కి 2” నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండూ ప్రభాస్ చిత్రాలే. కానీ దర్శకులు వేరు, నిర్మాతలు వేరు. “స్పిరిట్” సినిమా ఇంకా మొదలు కాలేదు కాబట్టి వదులుకోవడం పెద్ద సమస్య కాదు. అలాంటివి సినిమా ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయి. కానీ, “కల్కి 2” నుంచి ఆమె బయటికి రావడం నిజంగా ఒక షాక్.
ఇంతకీ నిర్మాతలు ఆమె లేకున్నా రెండో భాగం తీయగలమని ఎందుకు అనుకున్నారు? అంతగా వారిని ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమిటీ?
దీపిక పదుకోన్ పెట్టిన డిమాండ్లు ఇవీ….
- మొదటి భాగానికి తీసుకున్న పారితోషికం (18 కోట్లు) కన్నా అదనంగా 25 శాతం పెంచాలి. అంటే 23 కోట్ల పారితోషికం.
- రోజుకి కేవలం 7 గంటలు మాత్రమే పని చేస్తాను.
- తన వ్యక్తిగత సిబ్బందిని తగ్గించుకోను
నిర్మాతలు ఒప్పుకున్నవి, ఒప్పుకోనివి
- పారితోషికం కొంచెం పెంచుతాం.
- ఏడు గంటలే పని అనేది కుదరదు. సినిమా నిండా విఫ్ ఎక్స్ వర్క్ ఉంది. 7 గంటల పని అంటే సినిమాని పూర్తి చెయ్యలేం.
- ఎక్కువ గంటలు పని చెయ్యండి… మీకు కావాల్సిన అదనపు సదుపాయాలు కల్పిస్తాం.
- 25 మంది వ్యక్తిగత సిబ్బంది నుంచి 15 మందికి తగ్గించండి. వాళ్లందరికీ 5-స్టార్ వసతి ఇవ్వలేం.
దీపిక ఏ ఒక్క డిమాండ్ నుంచి వెనక్కి తగ్గలేదంట. దాంతో అనివార్యంగా ఆమె లేకుండానే సినిమా తీయాలని నిర్ణయించుకొంది వైజయంతి మూవీస్.





