రజినీకాంత్ తోనే మూడు మూవీస్

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో “జైలర్” చిత్రం వచ్చింది. అది అనూహ్య విజయాన్ని సాధించింది. దాంతో వెంటనే “జైలర్ 2”. చేసేందుకు అంగీకరించాడు రజినీకాంత్. ఇప్పుడు “జైలర్ 2” షూటింగ్ సాగుతోంది.
ఇలా సీక్వెల్ షూటింగ్ లో ఉండగానే అదే దర్శకుడితో ఇంకో సినిమా చేసేందుకు రజినీకాంత్ అంగీకరించడం విశేషం. రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది. తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చెయ్యాలనేది కమల్ హాసన్ ఆలోచన. దానికి రజినీకాంత్ ఒప్పుకున్నారు. కానీ దర్శకుడి విషయంలోనే ఇన్నాళ్లూ తర్జన భర్జన పడ్డారు. తాజాగా ఈ బాధ్యతని నెల్సన్ దిలీప్ కుమార్ కి అప్పగించారు.
నిజానికి ఈ సినిమాని మొదట శంకర్ కి కానీ, లోకేష్ కనగరాజ్ కి కానీ ఇవ్వాలనుకున్నారు. కానీ శంకర్ “భారతీయుడు 2”, “గేమ్ ఛేంజర్” సినిమాలతో మొత్తం క్రేజ్ ని పోగొట్టుకున్నారు. దాంతో ఫామ్ లో ఉన్న లోకేష్ ని అనుకున్నారు. కానీ “కూలీ” సినిమా తర్వాత రజినీకాంత్ కి లోకేష్ మీద పెద్దగా గురి కుదరలేదంట.
చివరికి “జైలర్ 2” సెట్ లోనే మరో సినిమా స్క్రిప్ట్ ఐడియా చెప్పిన నెల్సన్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. సో, నెల్సన్ వరుసగా రజినీకాంత్ తో మూడు సినిమాలు తీసినట్లు అవుతుంది.