అమెరికాలో ‘ఉస్తాద్’కి డిమాండ్

TeluguCinema Team 09 Oct 2025
Pawan Kalyan selfie with Raashi Khanna


పవన్ కళ్యాణ్ నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదల అయ్యాయి. అదీ కూడా రెండు నెలల గ్యాప్ లో. “హరి హర వీర మల్లు”, “ఓజీ” చిత్రాలను ఒకే డిస్ట్రిబ్యూటర్ అమెరికాలో విడుదల చేశారు. ఐతే మొదటి సినిమా దారుణంగా పరాజయం పాలు అయింది. చాలా నష్టాలు తెచ్చిపెట్టింది.

ఇక “ఓజి” సినిమాని చాలా తక్కువకి కొన్నారు అదే డిస్ట్రిబ్యూటర్. 2 మిలియన్ల వసూళ్లు వస్తే చాలు గట్టెక్కుతాను అని అనుకున్నారు డిస్ట్రిబ్యూటర్. ఐతే, “ఓజీ” ఏకంగా 5.5 మిలియన్ల డాలర్ల వసూళ్లు అందుకొంది. అంటే బ్రేక్ ఈవెన్ (లాభనష్టాలు లేని స్థితి)కి అదనంగా 2.5 మిలియన్ల డాలర్లు (20 కోట్ల రూపాయలు) వచ్చాయి.

“హరి హర వీర మల్లు” ద్వారా వచ్చిన నష్టాలు పోగా కొంత లాభాలని మిగిల్చింది “ఓజీ”. అలా పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో లాభనష్టాల బ్యాలెన్స్ అయింది డిస్ట్రిబ్యూటర్ కి.

ALSO READ: Ustaad Bhagat Singh aims for Maha Shivaratri 2026?

“ఓజీ” అమెరికాలో భారీ హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”కి మంచి డిమాండ్ పెరిగింది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News