
విద్యుల్లేఖ రామన్… సింపుల్ గా విద్యు అని పాపులర్ అయింది. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన విద్యు ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఈ బికినీ ఫోటోలకి వచ్చిన కామెంట్స్ చూసి ఆమె మండిపడుతోంది.
సమంత, నాగ చైతన్య విడిపోయినట్లే నువ్వు కూడా అలాగే వెళ్తున్నావా అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్లు పెట్టారు. ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు పెట్టడం వల్లే సమంత కాపురంలో మంటలు రేగాయి అనే ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో నడుస్తోంది. అదే ఉద్దేశంతో… ఇలాంటి ఫోటోలు పెట్టి నీ కాపురం కూల్చుకోకు అని విద్యుల్లేఖకి కొందరు సలహా ఇచ్చారు. “విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నావు…” అనే ఇంకొందరు కామెంట్స్ చేశారు. దాంతో ఆమె ఘాటుగా స్పందించారు.
విద్యుల్లేఖ ఇటీవల బాగా సన్నబడింది. బరువు తగ్గేందుకు తాను ఏ జిమ్ములో చేరిందో ఆ ట్రైనర్ తోనే ప్రేమలో పడింది. కరోనా లాక్డౌన్లో వీరి పెళ్లి జరిగింది. లేటెస్ట్ గా ఇలాంటి బికినీ ఫోటోలు షేర్ చేస్తోంది.
“ఒక స్త్రీ వేసుకొనే డ్రెస్సింగ్ స్టయిలే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ సుఖంగా ఉన్నారా? నిజాయతీ, నమ్మకం ఉన్న భర్త ఉన్నాడు నాకు. మీలాంటి వారి కామెంట్స్ ని పట్టించుకోవద్దని ఆయన అన్నారు. కానీ నేను మౌనంగా ఉండలేకపోయాను. పాతకాలం ఆలోచనలు వీడండి అంకుల్స్ అండ్ ఆంటీస్,” అని ఘాటుగా సమాధానం ఇచ్చింది విద్యు.