ఊహించినట్లే మురుగకి హ్యాండిచ్చాడు

Vijay

తమిళ సూపర్ స్టార్ విజయ్, దర్శకుడు మురుగదాస్ ఒకప్పుడు థిక్ ఫ్రెండ్స్. “తుపాకీ”, “కత్తి”వంటి సూపర్ హిట్స్ వచ్చాయి వీరి కాంబినేషన్ లో. ఐతే, మురుగదాస్ ఆలోచనల్లో ఫ్రెష్ నెస్ పోయింది, ఆయన ఐడియాల కత్తి తుప్పుపట్టింది అని ఇటీవల విడుదలైన “స్పైడర్”, “సర్కార్” సినిమాలు ప్రూవ్ చేశాయి. “సర్కార్” సినిమా రిలీజ్ అయిన వెంటనే విజయ్ డిసైడ్ అయ్యాడట… కొన్నాళ్ళు మురుగదాస్ కాంబినేషన్ కి దూరంగా ఉండాలని.

ఆలా.. వరుసగా అట్లీ డైరెక్షన్లో “విజిల్”, లోకేష్ కనగరాజ్ తో “మాస్టర్” సినిమాలు చేశాడు. విజయ్ 65వ సినిమాని మళ్ళీ మురుగదాస్ డైరెక్క్షన్లోనే ఉంటుందని సన్ పిక్షర్న్ గతంలో ప్రకటించింది. ఐతే, విజయ్ మాత్రం తన 65వ చిత్రం కూడా అప్ కమింగ్ డైరెక్టర్ కే అప్పచెప్పాడు. నెల్సన్ దిలీప్ కుమార్ అనే యువ దర్శకుడు ఈ సినిమా తీయబోతున్నట్లు ఈ రోజు అనౌన్సమెంట్ వచ్చింది.

అలా, మురుగదాస్ ని సైడ్ చేశాడు విజయ్. కొన్నాళ్ల గ్యాప్ తర్వాతే మళ్ళీ మురుగతో వర్క్ చేస్తాడట.

Advertisement
 

More

Related Stories