- Advertisement -

విజయ్ దేవరకొండ ఈ మధ్య పలు సినిమాల ఫంక్షన్లకు వచ్చేసి ఆ సినిమాలని ప్రోమోట్ చేశారు. ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా ప్రొమోషన్ బాధ్యతలు తీసుకున్నాడు. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి సినిమాల్లో నటించిన ఆనంద్ కొత్త చిత్రం… పుష్పక విమానం.
ఈ సినిమా ప్రొమోషన్ లో భాగగం “గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్’’ అనే ఒక వీడియో విడుదల చేశారు దేవరకొండ బ్రదర్స్. ఇది ఆసక్తికరంగా సాగింది. కెరీర్, ఇష్టాయిష్టాలు, పెళ్లి ప్లాన్స్…. ఇలా ఎన్నో విషయాలు వారు మాట్లాడుకున్నారు.
అలాగే, సినిమాల్లోకి రాకముందే 30-40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపారు విజయ్ దేవరకొండ.
విజయ్ గురించి, ఆనంద్ గురించి మరింతగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.