బిర్యానీ తింటే సెట్ అవుద్ది!

Vijay Deverakonda

హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో ఎవరికీ గాయాలు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లా ఉం డవల్లి సమీపంలో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు బొలెరో వాహనాన్నీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించారు .”మేమంతా క్షేమం. స్ట్రెంత్ వర్కువట్ కూడా చేశాను. కొంచెం తలపై నొప్పి ఉంది. కానీ మంచి బిర్యానీ తిని, సుఖంగా నిద్రపోతే అంతా సెట్ అవుతుంది. ఎవరూ వర్రీ కావొద్దు,” అని పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ.

విజయ్, రష్మిక ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. ఐతే, వాళ్ళు తమ ఎంగేజ్ మెంట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. నిన్న పుట్టపర్తిలో మాత్రం విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించాడు.

విజయ్ ప్రస్తుతం దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది.

https://twitter.com/TheDeverakonda/status/1975224238748643669

More

 

Related Stories