ప్రభాస్ సినిమాకి ఇంజనీర్లు కావాలట!

Prabhas


ఒక సినిమా మేకింగ్ కి ఇంజనీర్లతో పని ఏముంటుంది? కానీ, ప్రభాస్ తో తీయబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం మెకానికల్, ఆటోమొబైల్, రోబోటిక్ ఇంజనీర్లను తీసుకోనున్నారు. మాతో పని చేసేందుకు ఇంజనీర్లు కావాలి అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ టీం, నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అడుగుతోంది.

సోషల్ మీడియా ద్వారా ఇంజనీర్లకి ఆహ్వానం పలికింది.

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీని రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ సినిమాని గతేడాదే స్టార్ట్ చేస్తారని భావిస్తే అది ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యేలా ఉంది. ఈ సినిమాకి కావాల్సిన సెట్స్, సినిమాలో వాడే ‘ఫ్యూచరిస్టిక్ వెహికిల్స్’ డిజైన్ చేసేందుకు ఇంజనీర్ల సాయం తీసుకోనుంది టీం.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొను నటించనుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories