ఈ ఎన్నికల్లో కంగన నిలబడుతుందా?

Kangana


కంగన రనౌత్ హీరోయిన్ గా వెనుకబడింది. ఆమె నటించిన ప్రతి సినిమా పరాజయం పాలు అవుతోంది. మణికర్ణిక తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్ తీసుకురాలేదు.

ఆమె గత 20 సినిమాలు ఫ్లాప్ అని కొందరు లెక్కలు తీస్తున్నారు. మరికొందరు 12 చిత్రాలు అని అంటున్నారు. ఎన్ని సినిమాలు పోయాయి అన్నది పక్కన పెడితే, ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా అయినా, ఆమె హీరోయిన్-ఓరియెంటెడ్ సినిమా చేసినా అవి ఢమాల్ అంటున్నాయి అనేది వాస్తవం.

అందుకే ఆమె ఇక రాజకీయాల వైపు చూపు వేసింది అనేది టాక్. ఆమె చాలాకాలంగా ప్రధాని మోదీకి వీరాభిమానిగా ఉన్నారు. ప్రధానికి అనుకూలంగా, బీజేపీకి వకల్తాగా ఆమె చాలా హడావిడి చేస్తున్నారు. ఐతే, ఆమె బీజేపీలో సభ్యురాలు కాదు. ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీలో చేరుతారు అని చెప్తున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కంగనని ఆమె సొంత రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలో నిలుపుతారు అని అంటున్నారు. మరి కంగన సినిమాలు పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories