ఇప్పుడైనా సంజనకు బెయిల్ వస్తుందా?

Sanjana

రియా చక్రవర్తికి, ఆమె తమ్ముడికి డ్రగ్స్ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు, బెంగళూరు డ్రగ్స్ కేసుకు ఏ సంబంధం లేదు. కానీ, బెంగళూరు డ్రగ్స్ కేసు కూడా వీగిపోతుంది అని టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ నుంచి జైలు జీవితం గడుపుతున్న సంజనకు ఈసారి బెయిల్ రావొచ్చని అంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమె బెయిల్ రిజెక్ట్ అయింది.

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రానీ అసలైన వ్యక్తి అనేది బెంగళూర్ క్రైమ్ పోలీసుల వాదన.

ఆమె అకౌంట్ నుంచి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు అధికారులు గుర్తించారు. ఇంతగా ఎలా సంపాదించారు అని ఈడీ అడిగిన ప్రశ్నలకు సంజన.. సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్, ఫొటో షూట్స్ వాటి ద్వారా వచ్చాయని చెప్పింది. కానీ ఆమె డ్రగ్స్ వ్యాపారంతోనే ఇంత సంపాదించింది అని పోలీసులు చెప్తున్నారు.

డ్రగ్స్ కేసులో బలమైన ఆధారాలు లేకపోతే … పోలీసుల వాదనని కోర్టులు పట్టించుకోవడం లేదు. అందుకే లేట్ గా ఐనా బెయిల్ ఇస్తున్నాయి. మరి సంజనకు ఇప్పుడైనా ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుందా?

Advertisement
 

More

Related Stories