మా ఎన్నికల్లో స్టార్స్ ఓటేస్తారా?

Pawan Kalyan, Mahesh Babu, Prabhas


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపిస్తున్నాయి. మీడియా కూడా వేరే న్యూస్ లేనట్లుగా అదే పనిగా ఈ ఎన్నికల వార్తలతో నింపేస్తున్నాయి. 950 మంది సభ్యులున్న సంఘానికి సంబందించిన ఎన్నికలు ఇవి. అందులో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారిని, ఇతర భాషల్లో సెటిల్ అయిన హీరోయిన్లని వదిలేస్తే… 400 నుంచి 500 మంది మాత్రమే ఓటు వేస్తారు.

ఈ 500 మందిలో పెద్ద హీరోలు ఎప్పుడూ ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఈసారి మహేష్ బాబు ఎలాగూ హైదరాబాద్ లో లేకుండా స్పెయిన్ కి వెళ్లారు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన వోటెయ్యచ్చు. చిరంజీవి, నాగార్జున ఈ లిస్ట్ లో ఉంటారు. ఎన్టీఆర్ ఓటుకు దూరంగా ఉంటానని ఇంతకుముందు చెప్పారు కానీ ఇప్పుడు వస్తాను అని అంటున్నారట. బాలకృష్ణ గ్యారెంటీగా ఓటు వేసే హీరో. ఆయన మంచు విష్ణుకు మద్దతిస్తున్నారు.

ప్రభాస్ ముంబైలో షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనేది చూడాలి. విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలు హైదరాబాద్ లో లేరు. నాగ చైతన్య, అఖిల్, గోపీచంద్, నితిన్ కూడా ఇక్కడే ఉన్నారు.

చాలా మంది హీరోయిన్లు ఓటుకు దూరంగా ఉండొచ్చు.

Advertisement
 

More

Related Stories