
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) చుట్టూ చాలా పెద్ద ప్రచారం సాగుతోంది. కేవలం సినిమానే కాకుండా, ఈ ఏడాది ఇండస్ట్రీని ఆదుకునే సినిమాగా ‘పెద్ది’ని చూస్తున్నారు చాలామంది. అందుకు తగ్గట్టే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్ “ఆటే నా పొగరు” అని డైలాగ్ చెప్పాడు. దానికి తగ్గట్లే సినిమా అంతా ఆటల చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా స్పోర్ట్స్ సినిమాలు అంటే ఎదో ఒక ఆటపై ఉంటుంది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నాలుగు, ఐదు ఆటలు ఆడుతాడట. ఇప్పటికే ట్రైలర్ లో క్రికెట్, రెస్లింగ్ (కుస్తీ) ఆటలు చూపించారు. కానీ ఇందులో మరో 3 క్రీడలు కూడా ఉన్నాయంట. అవేంటో వెండితెరపై చూసి ఎంజాయ్ చేయాలంటోంది యూనిట్.
రామ్ చరణ్ ని మొదట క్రికెటర్ గెటప్ లో చూపించారు. ఆ తర్వాత పహిల్వాన్ గెటప్ లో చరణ్ ను చూపించారు. మిగతా మూడు ఆటలు, ఆ గెటప్ లు దాచి పెట్టారు. ఎందుకో. బహుశా వాటిని సిల్వర్ స్క్రీన్ పై చూస్తేనే ఆ మజా ఉంటుందని భావిస్తున్నారు.
‘పెద్ది’ సినిమాను ఆది నుంచి మల్టీ-స్పోర్ట్స్ జానర్ గానే చెబుతున్నారు. ట్రైలర్ లో “క్రాస్ ఓవర్ అథ్లెట్” అని చెప్పారు చరణ్ గురించి. అలాంటిది వాస్తవ ప్రపంచంలో లేదు. కానీ సినిమాటిక్ డ్రామా కోసం దర్శకుడు బుచ్చిబాబు అలా ఆ వర్డ్ కాయిన్ చేశారట.
