Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!

TeluguCinema, June 1, 2026June 1, 2026
Ram Charan's Peddi

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన “పెద్ది” (Peddi) సినిమా మరో మూడు రోజుల్లో మన ముందుకు రానుంది. తెలుగునాట కళ్ళు చెదిరే ఓపెనింగ్ రాబట్టుకునేలా ఉంది. సినిమాకి సూపర్ హైప్ వచ్చింది. ఐతే, తెలుగులో ఓపెనింగ్ బాగుంటుంది, సినిమా బాగుంటే రెండు వారాలు కుమ్మి పారేస్తుంది అని కచ్చితంగా చెప్పొచ్చు. మరి హిందీ పరిస్థితి ఏంటి?

ఇప్పటికే హిందీ కోసం ఢిల్లీలో ఈవెంట్, భోపాల్ లో ఈవెంట్, ముంబై లో ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్ ప్రచారం చేశాడు. ఐతే, పెద్ది హిందీ ట్రైలర్ కి పెద్ద ఊపు రాలేదు. స్పందన కూడా తక్కువే ఉంది అని యూట్యూబ్ మిలియన్ వ్యూస్ చెప్తున్నాయి.

ఐతే, హిందీ మార్కెట్ లో ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్లు తక్కువే ఉన్నా ఆ తర్వాత ఊపందుకొని కళ్ళు చెదిరే హిట్స్ కొట్టిన సినిమాల లిస్ట్ పెద్దదే పుష్ప సినిమాకి అలాగే జరిగింది. ధురంధర్ చిత్రం విషయంలోనూ అదే జరిగింది. ఐతే మొదటి వీకెండ్ కనీసం గౌరవప్రదమైన అమౌంట్ పోస్ట్ చేసి, మంచి టాక్ తెచ్చుకుంటే ఓవరాల్ కలెక్షన్లు భారీగా ఉంటాయి. పెద్ది విషయంలో అలాగే జరుగుతుంది అని నిర్మాతల నమ్మకం.

మొదటి రోజు భారీ ఓపెనింగ్ రాకపోయినా… సినిమా విడుదలైన తర్వాత టాక్ తో సూపర్ గా పుంజుకుంటుంది అని భావిస్తోంది ఈ సినిమా టీం.

ఒక్క తెలుగు మార్కెట్ కలెక్షన్లతో ఈ సినిమా బడ్జెట్ ని రాబట్టుకోవడం కష్టం. అలాగే తెలుగులో మాత్రమే పెద్ద హిట్ ఐతే కలెక్షన్ మొత్తం మూడు, నాలుగు వందలే కనిపిస్తుంది. 800, 1000 కోట్ల భారీ అమౌంట్ కనపడాలంటే హిందీ మార్కెట్ కీలకం.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే

Recent News

  • చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?
  • ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3
  • Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి
  • Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes