
మినిమం వారానికి 2 ఫొటోషూట్లు రిలీజ్ చేస్తోంది ఇషా రెబ్బా (Eesha Rebba) ఒకవేళ ప్రాపర్ ఫొటోషూట్లు లేకపోతే, తన ఐఫోన్ నుంచి తీసిన స్టిల్స్ ను సోషల్ మీడియాలో పెడుతోంది. ఇలా తనకు ఫాలోవర్స్ తగ్గకుండా జాగ్రత్త పడుతోంది ఈ తెలుగు హీరోయిన్.
అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ పెడుతున్న ఫొటోలతో ఆమె ఇప్పుడు ఓ కొత్త సమస్య ఎదుర్కొంటోంది.
వరుసగా పెడుతున్న ఫొటోలు చూసి, నెటిజన్లు ఆమెను మరో విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇలా ఫొటోలు పెట్టడమేనా, పెళ్లి కబురు చెప్పేదమైనా ఉందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే.
కొన్నాళ్లుగా దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ తో ఆమె డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని వాళ్లు నేరుగా చెప్పనప్పటికీ కలిసి కనిపిస్తూ పరోక్షంగా క్లారిటీ ఇస్తున్నారు. ఇక రేపోమాపో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం నడుస్తోంది.
ఇలాంటి టైమ్ లో పెళ్లి కబురు చెప్పకుండా, ఇలా సోలో ఫొటోలు రిలీజ్ చేయడాన్ని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ఆ మూడు ముళ్ల ముచ్చటేదో చెప్పేస్తే ఓ పనైపోతుందంటూ ఈషా రెబ్బాను టీజ్ చేస్తున్నారు.
