
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన పాత్రలో చూపించిన సినిమా రాలేదు. ఆ విధంగా ‘ఆల్పా’ కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్యనుంది.
ఆల్ఫా చిత్రం షూటింగ్, ఆ క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు. .
“నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను ఇంతకుముందు అనుభవించని ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. షూటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ఎంతో ప్రేమించాను, ఆస్వాధించాను.ఈ చిత్రంలోని కథ ఇద్దరు మహిళ కథా నాయికల చుట్టే తిరుగుతుంది. అదే నాకు ఎక్కువగా నచ్చిన అంశం. ఇలాంటి స్క్రిప్ట్‌లు మనం అరుదుగా చూస్తుంటాం. ఈ ప్రయాణంలో భాగం అవ్వడం నాకెంతో సంతోషానిచ్చింది. ‘ఆల్ఫా’ అనేది ఆటిట్యూడ్‌కి, సెలెబ్రేషన్కి కేరాఫ్‌గా నిలుస్తుంది,” అలియా అన్నారు.
ఆదిత్య చోప్రా నిర్మాణంలో ‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’ చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.తెలుగులో కూడా అదే పేరుతొ విడుదల చేస్తున్నారు.
