
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం “మా ఇంటి బంగారం”తో హిట్ కట్టబెట్టారు. వరుస ఫ్లాపులతో సతమతం అయినా అఖిల్ అక్కినేనికి “లెనిన్”తో మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు.వీళ్లద్దరూ పరీక్ష పాస్ కావడంతో ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)పై చూపు పడింది.
కిరణ్ అబ్బవరం ఇప్పటికే కొన్ని విజయాలు చూశాడు. “క”, “కే-రాంప్” వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే కెరీర్ ప్రారంభంలో లవ్ స్టోరీ చూసి ఆ తర్వాత ట్రాక్ మార్చాడు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత “చెన్నై లవ్ స్టోరీ” (Chennai Love Story) అంటూ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు ప్రేమకథతో వస్తున్నాడు.
సాయి రాజేష్ (ఇంతకుముందు హృదయ కాలేయం, బేబీ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు) ఈ సినిమాకి రచయిత, నిర్మాత. శ్రీ గౌరీప్రియ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం ఇచ్చారు. ఐతే, ఈ సినిమాకి ఇంకా ఊపు రావడం లేదు. బజ్ పెరగలేదు. సో, దీనికి సాలిడ్ ఓపెనింగ్స్ తీసుకురావడం కిరణ్ కి పెద్ద ఛాలెంజ్.
మరి ఈ పరీక్షలో కిరణ్ నెగ్గుతాడా అనేది చూడాలి.
