కొన్ని రోజుల కిందటి సంగతి. ఊహించని విధంగా డెకాయిట్ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుంది. అప్పటికే ఆమెపై గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా కొనసాగించారు. కానీ ఆమె తప్పుకుంది. ఆమె తప్పుకుందని కొంతమంది, తొలిగించారని మరికొంతమంది రాసుకొచ్చారు. ఈ క్రమంలో అడవి శేష్ వైపు అన్ని వేళ్లు చూపించాయి.
ఎట్టకేలకు ఈ అంశంపై హీరో అడివి శేష్ స్పందించాడు. శృతిహాసన్ ను తొలిగించడం విషయంలో పెద్ద వివాదం ఏమీ లేదంటున్నాడు ఈ హీరో. వర్కింగ్ స్టయిల్స్ సెట్ అవ్వక ఆమె తప్పుకుందని వెల్లడించాడు.
“శృతిహాసన్ తో పనిచేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మా వర్కింగ్ స్టయిల్స్ కుదరలేదు. పైగా కూలీ సినిమాతో ఆమె బిజీగా ఉంది. ఎలాంటి గొడవల్లేవు. మాట్లాడుకొని, ఫ్రెండ్లీగానే విడిపోయాం. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్ శృతిహాసన్ కు సింక్ అవ్వలేదు. కేవలం ఈ కారణంతోనే ఆమె తప్పుకుంది. అంతకంటే పెద్ద వివాదం ఏమీ లేదు.”
ఆ వెంటనే మృణాల్ ను తీసుకున్నాడు అడివి శేష్. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు కథ విన్న తర్వాత 2-3 వారాలు టైమ్ తీసుకొని ఓకే చెబుతారని.. మృణాల్ మాత్రం ఉదయం 10 గంటలకు కథ విని, మధ్యాహ్నం ఒంటి గంటకు ఓకే చెప్పిందని అన్నాడు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…