నటి అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో వివరణ ఇచ్చింది.
ఇటీవల కొంతమంది హీరోయిన్లు సబ్‌స్క్రిప్షన్ పేరుతో గ్లామర్ ఫోటోలు, వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తున్నారనే చర్చ టాలీవుడ్‌లో సాగుతోంది. హాట్ హాట్ గ్లామర్ ఫోటోలు, మరీ శృతి మించి తమ బెడ్ రూమ్ నుంచి, బాత్రూం నుంచి వీడియోలు తీసి పెడుతున్నారు కొందరు భామలు. దాంతో గగ్గోలు మొదలైంది.
ఈ నేపథ్యంలో అనన్య నాగళ్ళపై కూడా సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలకు స్పందిస్తూ అనన్య ఒక వీడియోను షేర్ చేసింది. సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను తాను ఒక కమ్యూనిటీలా ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ప్రారంభించానని చెప్పింది. అలాగే తన రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక కంటెంట్‌ను పంచుకోవడమే లక్ష్యమని వివరించింది.
గత ఏడాది ఏప్రిల్ 7, 2025న పోస్ట్ చేసిన వీడియోను మళ్లీ షేర్ చేస్తూ, అందులో “ఓం నమః శివాయ” మంత్రాన్ని 21 రోజులు, రోజుకు 108 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది.
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై వస్తున్న అనవసర కామెంట్లను చూసి ఈ వివరణ ఇస్తున్నానని ఆమె తెలిపింది. తన సబ్‌స్క్రిప్షన్‌లో గ్లామరస్ లేదా అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేయలేదని స్పష్టంచేసింది.
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…