ప్రస్తుతం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎంత క్రేజ్ తో వచ్చిన సినిమా అయినా బకెట్ తన్నేయాల్సిందే. ఎంత స్టార్ డమ్ ఉన్నా ఫ్లాప్ అవ్వాల్సిందే. డబ్బింగ్ సినిమాల పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఇలాంటి టైమ్ లో వస్తోంది ‘రెట్రో’.
సూర్య హీరోగా నటించిన ఈ సినిమా నెగెటివ్ సెంటిమెంట్ ను ఆపుతుందా? ఈ విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద సూర్య పెర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు.
రీసెంట్ గా ఒక్క సక్సెస్ కూడా ఇవ్వలేకపోయాడు. ‘రెట్రో’ అతడికి విజయాన్నిచ్చిందంటే, నెగెటివ్ సెంటిమెంట్ ను కూడా ఆపినట్టే.
రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చింది. అంతకంటే ముందు ‘ఎంపురాన్’ వచ్చింది. ఇంకాస్త వెనక్కు వెళ్తే ‘వీర ధీర శూర’, ‘పట్టుదల’, ‘విడుదల 2’, ‘కంగువా’ లాంటి చాలా సినిమాలొచ్చాయి. ఈ డబ్బింగ్ సినిమాలేవీ తెలుగుతెరకు మెరుపులు అద్దలేకపోయాయి.
ఇలా కొన్నాళ్లుగా తెలుగులో డబ్బింగ్ చిత్రాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పుడు ‘రెట్రో’ వస్తోంది. ఇదైనా ఈ ఫ్లాపుల పరంపరకు బ్రేకులేస్తుందా, గుంపులో కలిసిపోతుందా అనేది చూడాలి.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…