కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని వెనక ఎవరున్నారంటూ కథనాలు కూడా వస్తున్నాయి. ఈ ట్రోలింగ్స్ ను రీసెంట్ గా బన్నీ వాస్ తప్పు పట్టారు. మెగా కాంపౌండ్ లో అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు బన్నీ వాసు. కానీ పరోక్షంగా అభిప్రాయబేధాలున్నాయని అంగీకరించాడు. ఇప్పుడు హైపర్ ఆది వంతు వచ్చింది.
పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ గా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది, అల్లు అర్జున్ కు పూర్తి మద్దతు ప్రకటించడం అందర్నీ ఆకర్షించింది.
“అల్లు అర్జున్ మీద ట్రోల్స్ వేసేవాళ్లకు నేను చెప్పేది ఒకటే.. పవన్ కల్యాణ్ కు గానీ, మెగా ఫ్యామిలీలో మిగతా హీరోలకు గానీ ఎలాంటి ఫీలింగ్ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ను కొంతమంది కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోల్స్, థంబ్ నెయిల్స్ పెట్టడం ఇకనైనా ఆపేయాలి.”
ఇలా బన్నీకి తన పూర్తి మద్దతు ప్రకటించాడు హైపర్ ఆది.
మెగా కాంపౌండ్ కు సంబందించి ఏదో ఒక వివాదం ప్రతిసారి తెరపైకి రావడం కామన్ గా మారిందని, నిజానికి అది వివాదం కాదని, కేవలం కొంతమంది సృష్టి అని అంటున్నాడు హైపర్ ఆది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…