కియారా అద్వానీ తెలుగులో బాగా పాపులర్. బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగులో ఆ హీరోతో రెండుసార్లు నటిస్తే రెండు సార్లూ అపజయమే చూసింది. అందుకే, కియారా, రామ్ చరణ్ కాంబినేషన్ కి యాంటీ సెంటిమెంట్ పడింది.
ఆమె మొదటిసారి తెలుగులో మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రంలో నటించింది. అది దారుణంగా అపజయం పాలైంది. బాగా ట్రోలింగ్ కి గురైంది. ఇక తాజాగా “గేమ్ చేంజర్”లో నటించింది. ఇది కూడా ఫ్లాప్ అయింది.
ఐతే, “గేమ్ చేంజర్” విషయంలో ఆమె ముందే మేల్కొంది. ఈ సినిమాలో తన పాత్రని కుదించారని ఆమె అలిగింది. అందుకే, సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. కేవలం హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం మినహా మరో ప్రమోషన్ చెయ్యలేదు. మొత్తానికి రామ్ చరణ్ తో నటించిన రెండు తెలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ జంటకి ఇకపై క్రేజ్ ఉండదు. వీరి కాంబినేషన్ లో ఇక సినిమా ఉండకపోవచ్చు.
కియారా ప్రస్తుతం “KGF” హీరో యష్ సరసన “టాక్సిక్” (Toxic) చిత్రంలో నటిస్తోంది.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…