హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై మీనాక్షి చౌదరి టీమ్ క్లారిటీ కూడా ఇచ్చింది, పుకార్లను కొట్టి పారేసింది. ఇప్పుడు స్వయంగా మీనాక్షి ఈ రూమర్స్ పై స్పందించింది.
తన పెళ్లిపై వచ్చిన పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదంటోంది మీనాక్షి. గత నెలలో కూడా ఇలాంటిదే ఓ పుకారు వచ్చిందని, ఓ తమిళ హీరో కొడుకును పెళ్లాడతానంటూ వార్తలొచ్చాయని, అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
“ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను, అలా అని ఇప్పటికిప్పుడు మింగిల్ అయ్యే ఆలోచన కూడా లేదు.” అంటూ ప్రకటించిన మీనాక్షి.. పనిలోపనిగా మరో పుకారుపై కూడా స్పష్టత ఇచ్చింది.
“సలార్-2” లో ఈమెను తీసుకున్నారనే పుకారు వ్యాపించింది. అది కూడా అబద్ధమని చెప్పేసింది.
ఆమె నటించిన “మెకానిక్ రాకీ” విడుదలకు సిద్ధమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయింది.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…