Categories: న్యూస్

కంగువా… జీవితకాలం లేటు

రోజురోజుకు నెగెటివ్ టాక్ పెరిగిపోవడంతో ‘కంగువా’ టీమ్ వెనక్కు తగ్గక తప్పలేదు. మొన్నటివరకు నిడివిపై భీష్మించుకొని కూర్చున్న యూనిట్, ఇప్పుడు వెనకడుగేసింది. ఫీడ్ బ్యాక్ ఆధారంగా సినిమా  నిడివి తగ్గించింది. ఒకట్రెండు నిమిషాలు కాదు, ఏకంగా సినిమా నుంచి 12 నిమిషాలు కట్ చేసింది.

ఇప్పుడు సినిమా రన్ టైమ్ 2 గంటల 22 నిమిషాలు మాత్రమే. ట్రిమ్ చేసిన వెర్షన్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా రిలీజైన మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో సౌండ్ సిస్టమ్ బాగాలేదని, రన్ టైమ్ ఎక్కువైందంటూ విమర్శలు చెలరేగాయి. సౌండ్ ఇష్యూస్ ను సరిచేసిన యూనిట్, నిడివి తగ్గించడానికి మాత్రం ఇష్టపడలేదు.

ఎట్టకేలకు సినిమా విడుదలైన 4 రోజుల తర్వాత రన్ టైమ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాలో గోవా ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాల్ని ఎక్కువగా కట్ చేశారు. ఇంకా చెప్పాలంటే సూర్య, దిశా పటానీ కాంబోలో తెరకెక్కిన సన్నివేశాలు ఎక్కువగా కట్ అయ్యాయి.

తాజా మార్పు వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఈ నిర్ణయం జీవితకాలం లేటు అంటున్నారు నెటిజన్లు.

Admin

Recent Posts

Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్

బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…

52 minutes ago

The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…

14 hours ago

Samantha: అవును, మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నా

గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…

14 hours ago

‘Alpha’ నాకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్: అలియా భట్

అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…

18 hours ago

Janhvi Kapoor: పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా?

"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…

22 hours ago

చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia

ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…

24 hours ago